Header Banner

అవును లేఖ రాశా.. ఆయన చుట్టూ దెయ్యాలున్నాయ్! కవిత సంచలన కామెంట్స్..

  Fri May 23, 2025 22:28        Politics

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తాను రాసిన లేఖ లీక్ కావడంపై ఎమ్మెల్సీ కవిత తీవ్రంగా స్పందించారు. కేసీఆర్‌ను దేవుడితో పోల్చిన ఆమె, ఆయన చుట్టూ కొందరు దెయ్యాలు ఉన్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను కేసీఆర్‌కు లేఖ రాసిన మాట వాస్తవమేనని కవిత అంగీకరించారు. సుమారు రెండు వారాల క్రితమే ఈ లేఖ రాసినట్లు ఆమె తెలిపారు. అయితే, ఆ లేఖలో తన వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదని, కేవలం పార్టీ కార్యకర్తల అభిప్రాయాలను మాత్రమే కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశానని స్పష్టం చేశారు. "ఆ లేఖ నాదే, అందులో నా వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. కార్యకర్తల అభిప్రాయాలు మాత్రమే చెప్పాను" అని కవిత పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: పాకిస్థాన్‌కు భారత్ మరో షాక్.. మరో నెల వరకు వాటికి నో ఎంట్రీ!

 

అంతర్గతంగా తాను రాసిన లేఖ బయటకు రావడంపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక కచ్చితంగా కుట్ర ఉందని ఆరోపించారు. "కేసీఆర్‌ దేవుడు.. కానీ, కేసీఆర్‌ చుట్టూ దెయ్యాలు ఉన్నాయి. అంతర్గతంగా నేను రాసిన లేఖ బయటకు వచ్చిందంటే అర్థం ఏమిటి? నా లేఖ బయటకు వచ్చిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి?" అంటూ కవిత ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీలోని కొందరు కోవర్టులే ఈ లేఖను లీక్ చేసి ఉంటారని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. కేసీఆరే తమ నాయకుడని, ఆయన నాయకత్వంలోనే తామంతా పనిచేస్తామని కవిత పునరుద్ఘాటించారు. అయితే, పార్టీలోని లోపాలను సవరించుకుంటేనే భవిష్యత్తు ఉంటుందని తాను అభిప్రాయపడుతున్నట్లు తెలిపారు. కాగా, కవిత అమెరికా పర్యటన ముగించుకొని హైదరాబాద్ తిరిగి వచ్చారు. ఆమెకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #Hyderabad #RevaParty #Polices